అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా

30-09-2026 | 09:45pm
  1. ఎల్లారెడ్డిని మోడల్ గా తీర్చిదిద్దుతా...
  2. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు 

తాడ్వాయి,సెప్టెంబర్, 30( విజయ క్రాంతి): అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(Yella Reddy MLA K Madan Mohan Rao) తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆయన బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అభివృద్దే మంత్రంగా పనిచేస్తున్నానని తెలిపారు.తాను ఎల్లారెడ్డి  నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు.

రోడ్లు, చెరువులకు మరమ్మతులు, పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాట్లు తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.అన్ని రంగాలలో ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా మార్చడానికి కృషి చేస్తున్నానన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు సరైన రోడ్డు మార్గం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు వర్షాకాలంలో ఇబ్బందులు పడేవారని తెలిపారు.

వారి ఇబ్బందులను తొలగించడం కోసం చందాపూర్ రోడ్డు నుంచి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వరకు రూ. 20 లక్షల నిధులతో  సిసి రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్య తో పాటు నాణ్యమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

బ్రహ్మాజి వాడి గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. కృష్ణాజివాడిలో  మహిళా సమాఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు చందాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన నరేందర్ రెడ్డిని,గ్రామ మైనార్టీ సెల్ అధ్యక్షులు నాజిర్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందారు.

ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు వెంకట్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, షౌకత్ అలీ,గైని రాజలింగం,గైని శివాజీ, నరసింహారెడ్డి,మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యాం రావు,రమణారెడ్డి, మేకల రాజు, ప్రతాప్ రెడ్డి, సుధాకర్ రావు, పోచయ్య,బాల సాయిలు, సిద్ధిరాం రెడ్డి,ప్రసాద్ రావు, అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు