గోరిలపాడు తండాలో ఘనంగా శ్రీమంతాలు

30-09-2026 | 09:35pm

కూసుమంచి,(విజయక్రాంతి): గ్రామపంచాయతీలోని అంగన్వా(Anganwadi)డి కేంద్రంలో విజయవంతంగా పోషణ మాసం కార్యక్రమం(Poshan Maasam Events) నిర్వహించడం జరిగింది. పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా తిరుమలాయపాలెం ప్రాజెక్టు, నాయకన్ గూడెం సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో 7వ నెల పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం, సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ నుండి 9 మంది గర్భిణీ స్త్రీలకు సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహించడం జరిగింది.

మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్(Former MPP Srinivas Naik)  గర్భిణీలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లలోనే డెలివరీస్ కావాలని, అంగన్వాడీ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరడం జరిగింది.. ఏఎన్ఎం హైమావతి గర్భిణీల ఆరోగ్య సంరక్షణ గురించి స్థానికంగా దొరికే  పోషక విలువలు కలిగిన ఆహారం గురించి గర్భిణీలకు అవగాహన కల్పించారు.

మరిన్ని వార్తలు