వైద్య సేవలు వెంటనే ప్రారంభించాలి
30-09-2026 | 09:48pm
నిర్మల్ సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా వైద్య సేవలు వెంటనే ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) జిల్లా కన్వీనర్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పేదవారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం 23 కోట్లకు నిర్మించిన ఈ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ ఇస్తారు.