చినూర్ గ్రామంలో వీబీ జీ రామ్ జీ గ్రామసభ

30-09-2026 | 09:26pm

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని చీనురు గ్రామం(Cheenuru Village)లో విబిజి రామ్ జి గ్రామసభ గ్రామ సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక కార్యక్రమం(Vikasit Gram Panchayat Planning Programme)లో భాగంగా గ్రామ సోషల్ మ్యాప్ రిసోర్స్ మ్యాప్ లను ఏర్పాటు చేసుకొని గ్రామ అభివృద్ధి పనులను గుర్తించి నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,ఏపీవో సక్కుబాయి,ఎంపీఓ ప్రభాకర్ చారి,కార్యదర్శి అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య,వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు