సంకలబుడ్డి సైదులుకు పిల్లుట్ల రఘు ఘన నివాళి

17-10-2026 | 06:41pm

నేరేడుచర్ల, అక్టోబర్ 17(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలంలోని(Nereducherla Mandal) కల్లూరు గ్రామానికి చెందిన మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు సంకలబుడ్డి సైదులు(Sankalabuddi Saidulu) అకాల మృతికి చింతిస్తూ, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు(Pillutla Raghu) సంతాపం వ్యక్తం చేశారు. శనివారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, సైదులు భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో(Telangana Movement) పాల్గొన్న ఉద్యమకారుడు సైదులు మృతి బాధాకరమన్నారు.

ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని,పార్టీ తరఫున అన్ని విధాలా తోడుగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ ఉద్యమ నాయకుడు,అడ్వకేట్ నగేష్ రాథోడ్,మాజీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడియా శ్రీను నాయక్,నియోజకవర్గ నాయకుడు ముల్కలపల్లి రాంబాబు,మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు,జీలకర్ర రామస్వామి,సురబి సైదులు,జంపాల వెంకన్న,జింకల భాస్కర్,బుడిగా వెంకన్న,బుడిగా సతీష్,మాజీ సర్పంచ్ మేకపోతుల సైదులు,హుస్సేన్,శివాజీ తదితర గ్రామ బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు