గ్రామీణులకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం
ఆచార్య ఫౌండేషన్ చైర్మన్ డా. విద్యాసాగర్
మోతె, అక్టోబర్ 25 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్య సేవలను అందించడమే ఆచార్య ఫౌండేషన్(Acharya Foundation) ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ డా. విద్యాసాగర్ తెలిపారు. ఆదివారం మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవసరమైన వారికి హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
ప్రముఖ వైద్యులు డా. అమ్రిన్ మీర్జా, డా. శంకర్ నాయక్, నేత్ర వైద్య నిపుణురాలు తేజశ్రీలు సుమారు 80 మందిని పరిశీలించి అందులో 50 మందిని హైదరాబాద్ కామినేని వివిధ సమస్యల మేరకు పంపించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా సీనియర్ సిటిజన్స్ కన్వీనర్ దామెడీ గోపాల్ రెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర సీనియర్ నాయకుడు షకీల్ మీర్జా, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కట్టుకోజు నాగేంద్రాచారి, జిల్లా ప్రవాసీ కన్వీనర్ జనార్ధన్, కార్యదర్శి బానోతు శ్రీనివాస్ నాయక్, మోతె మండల సీనియర్ నాయకుడు మాదాసు సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు నాగం వెంకటేశ్వర్లు, కోడిస వెంకన్న, ఉప్పల రాంచద్రయ్య, బోడబట్ల కృష్ణమూర్తి, నందిగామ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.