పట్టభద్రుల ఓటరు నమోదుకు అవగాహన కల్పించాలి
ముఖ్య నాయకుల సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి/మొగుళ్లపల్లి (విజయక్రాంతి): పట్టభద్రుల ఓటరు నమోదుకు అవగాహన కల్పించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంపై మొగుళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గండ్రతో పాటు ఒడిసీఎంఎస్ రాష్ట్ర మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి రామస్వామి నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గండ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం పురోగతిపై నాయకులతో సమీక్షించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల భాగస్వామ్యం పెరిగేలా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.