గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మద్దూరు, (విజయ క్రాంతి): నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ(Maddur Municipality) పరిధిలోని రెనివట్ల రహదారిపై దినేష్ రైస్ మిల్ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో విద్యుత్ స్తంభానికి ఉరివేసుకున్న స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది.మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడి వద్ద మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలు లభించలేదు.
మృతుడిని ఎవరైనా గుర్తించినా, అతని కుటుంబ సభ్యులు లేదా బంధువుల వివరాలు తెలిసినా వెంటనే మద్దూరు పోలీసుల(Police)ను సంప్రదించాలని ఎస్ఐ విజయ్ కుమార్(SI Vijay Kumar) కోరారు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.