జనగామలో జాతీయ జెండా ఆవిష్కరణ

25-10-2026 | 03:15pm

జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్(Sevadal District President Jaya Mallesh) ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాదళ్ క్రమశిక్షణకు, సేవాభావానికి ప్రతీక అని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ ఐక్యత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జాతీయ జెండా దేశ ఐక్యతకు, రాజ్యాంగ విలువలకు గుర్తు అని, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్ మహారాజ్, సేవాదళ్ నాయకులు సుంకరి శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు