జీవిక స్టీల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల ధర్నా, రాస్తారోకో!

25-10-2026 | 03:12pm

చేగుంట అక్టోబర్ 25, (విజయక్రాంతి): చేగుంటలో పట్టణ కేంద్రంలో గల జీవిక స్టీల్ పరిశ్రమ(Jeevika Steel Industry) వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ రైతులు కంపెనీ ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలోని జీవిక స్టీల్ పరిశ్రమతో చుట్టూ గ్రామాలలో తీవ్ర నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతోందని, వ్యవసాయ పంట పొలాల్లో దుమ్ము,ధూళితో పంటలు నష్టపోతున్నాయని రైతులు, ఉల్లితిమ్మహి పల్లి, చుట్టూ ఉన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రైతులు, గ్రామస్తులు, బిఅర్ఎస్ నాయకులు కలిసి కంపెనీ ముందు టెంట్ వేసి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వెంటనే కంపెనీ అనుమతులు రద్దు చేసి జీవిక కంపెనీని తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

మరిన్ని వార్తలు