తెలంగాణ డీజీపీనీ కలిసిన జగన్

25-10-2026 | 03:35pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల ఘటనలపై డీజీపీ సివి ఆనంద్‌(DGP CV Anand)ను ఆదివారం కాంగ్రెస్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలతో పాటు, తాళ్లపేట గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా చోటుచేసుకున్న పరిణామాలను ఆయనకు వివరించి, సంబంధిత అంశాలపై చర్చించారు. డీజీపీనీ కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు సుర్మిళ్ళ వేణు, ఉప్పలయ్య, వేముల సంజీవ్, గడ్డం శ్రీనివాస్, సిటీ సత్యం రావు, కోట్నాక తిరుపతి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు