సీఐడీ అదుపులో రైస్ మిల్లర్స్

25-10-2026 | 10:21am

జాతీయ రహదారి పై అదుపులోకి తీసుకున్న అధికారులు 

ములుగు,అక్టోబర్ 25(విజయక్రాంతి): రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు(President of the Rice Millers Association) బాదం ప్రవీణ్ తో పాటు మరి కొంతమంది రైస్ మిల్లర్స్ యజమాలను ఆదివారం తెల్లవారుజామున సిఐడి అధికారులు(CID officials) అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిఐడి అధికారులు ఆదివారం తెల్లవారుజామున కొంతమంది రైస్ మిల్లర్స్ యజమానులను అదుపులోకి తీసుకోగా విషయం తెలుసుకున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మరికొంత మందితో సిఐడి అధికారుల వాహనం వద్దకు చేరుకున్నారు.

ములుగు మల్లంపల్లి జాతీయ రహదారిపై(Mulugu-Mallampalli National Highway) జాకారం సమీపంలో సిఐడి అధికారుల వాహనం వద్దకు చేరుకుని ఎందుకు తమ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో బాదం ప్రవీణ్ సైతం సిఐడి అధికారులు తీసుకొని హనుమకొండ కార్యాలయానికి తరలించడం తెలిసింది. అయితే జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిఐడి అధికారులు యజమాలను అదుపులోకి తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చిని అంశంగా మారింది.

మరిన్ని వార్తలు