కెప్టెన్‌గా తిలక్ వర్మ
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు జట్టు ప్రకటన
ముంబై, నవంబర్ 2 : త్వరలో జర గనున్న పురుషుల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీ(Asia Cup tournament) కోసం భారత ఏ జట్టును(India A team) బీసీసీఐ ప్రకటించిం ది. తెలుగుతేజం తిలక్ వర్మ కెప్టెన్‌గా(Tilak Varma is the captain) ఎంపికయ్యాడు. రజత్ పాటిదార్ అతనికి డిప్యూ టీగా వ్యవహరించనున్నాడు. టీ20 జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రాన్‌ను ఎం పిక చేసిన సెలక్షన్ కమిటీ బ్యాకప్‌గా కుమా ర్ కుశాగ్రకు అవకాశమిచ్చింది.
వన్డే ప్రపంచకప్ నేపథ్యం లో ఈ సారి రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. నవంబర్ 19 నుంచి 29 వరకూ దోహా వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భార త్ ఏ జట్టు పాకిస్థాన్ ఏ, యూ ఏఈ, నేపాల్ జట్లతో గ్రూప్ ఏలో ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఏ నేపాల్‌తో తలపడనుండగా, చిరకాల ప్రత్యర్థి పాక్‌ను నవం బర్ 22న ఢీకొంటుంది.
భారత్- ఏ జట్టు:
అభిషేక్ శర్మ, వైభవ్, ప్రభ్ సిమ్రాన్, తిలక్ వర్మ(కెప్టెన్), పాటిదార్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, కుమార్ కుశాగ్ర(కీపర్), సూ ర్యాన్ష్ షెడ్గే, షెహ్బాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనూష్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్