పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర

03-11-2026 | 10:54pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(BRS MP Vaddiraju Ravichandra) తన పెద్దన్న కిషన్ తదితరులతో కలిసి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో మంగళవారం పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. తాను చదువుకున్న ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో, వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు.

ఇందుకుగాను ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులు కోటి రూపాయలు సమకూర్చగా, చమురు సంస్థల నుంచి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయించి మొత్తం 7 కోట్లతో భువనాలు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన పెద్దన్న కిషన్ తదితరులతో కలిసి నిర్మాణపు పనులను పర్యవేక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణపు పనులను మరింత ముమ్మరం చేసి మే నెల చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టు, సిబ్బందికి ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు