విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

03-11-2026 | 10:53pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన విశ్వనాథ ఆలయాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా, భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయన్నారు.

ఎమ్మెల్యే వెంట మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, EO ముక్త రవి, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు