వివాదం మధ్య సిల్వర్ షో!

24-09-2026 | 01:11pm

భారత వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి(Roshibina Devi) ఆసియా క్రీడల్లో మరోసారి మెరిశారు. మహిళల 60 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం(Asian Games 2026 India Wushu Medal) చేసుకున్నారు. ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ జియాయు చేతిలో 0-2తో ఓటమి ఎదురైనా.. సిల్వర్ మెడల్‌తో పోటీని ముగించారు. ఈ పతకంతో రోషిబినా వరుసగా మూడో ఆసియా క్రీడల్లో మెడల్ సాధించిన ఘనతను అందుకున్నారు. 2018లో కాంస్యం, 2023లో రజతం తర్వాత.. 2026లోనూ మరో సిల్వర్ ఆమె ఖాతాలో చేరింది.

అయితే ఈసారి ఆసియా క్రీడల జట్టులో రోషిబినా ఎంపిక వివాదానికి(Roshibina Devi Selection Controversy) దారితీసింది. ట్రయల్స్‌లో దివ్యాన్షి చౌదరి విజయం సాధించినప్పటికీ, గాయం కారణంగా జట్టులో మార్పు జరిగినట్లు వుషు సమాఖ్య వెల్లడించింది. దీనిపై దివ్యాన్షి తరఫున ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో వివాదం నెలకొంది. రజతం సాధించిన అనంతరం ఈ అంశంపై రోషిబినా(Roshibina Devi Wushu Final) స్పందించారు. జట్టు ఎంపిక తన చేతుల్లో లేదని, అది సమాఖ్య తీసుకున్న నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఫైనల్లో గెలుపు కోసం రోషిబినా తీవ్రంగా పోరాడినా చైనా క్రీడాకారిణి జాంగ్ జియాయు పైచేయి సాధించారు. దీంతో రోషిబినా మరోసారి ఆసియా క్రీడల పోడియంపై నిలిచారు.

మరిన్ని వార్తలు