ప్రతి వాన చినుకును కాపాడుకునే విధంగా మనం కృషి చేయాలి

24-09-2026 | 02:43pm
  1. ప్రతి ఒక్కరూ, నేటి సంరక్షణ చేపడితేనే భూగర్భ జలాలను పెంపొందించగలుగుతాం
  2. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): భూగర్భ జలాలు(Groundwater) పెంపొందించాలి అంటే ప్రతి ఒక్కరూ నీటి నిల్వ చేయడం తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవడం తమ కులాల వద్ద నీరును వృధా చేయకుండా కాపాడుకోవడం వంటి సంరక్షణ చర్యలు చేపడితే భూగర్భ జలాలు వాటా అంత అవ్వే పెంపొంది నీటి సంరక్షణ చేసిన వారిగా మనం ఉంటామని జిల్లా కలెక్టర్ ఆసీస్ సాగ్వన్(District Collector Ashish Sangwan) అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మండలంలోని మీసంపల్లి గ్రామపంచాయతీలో ఆయన పర్యటించి గ్రామంలోని గ్రామపంచాయతీ పరిసర ప్రాంతంలో గ్రామ సర్పంచ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి తో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు నీటి నిల్వ చేసుకునే విధంగా ఓంకార్భ జలాలను పెంపొందించే దిశగా అవగాహన కల్పించి నీరును వృధా చేయకుండా కాపాడుకునే విధంగా కృషి చేయాలని అన్నారు.

అనంతరం జిల్లా అధికారులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనం పట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు లోటు జరగకుండా నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డిఓ రెండో ప్రభాకర్ ఎంపీడీవో తాహీర బేగం, గ్రామ సర్పంచ్, మరియు ఇందిరా కాంతి వ్రతం ప్రాజెక్టు మేనేజర్ రామ్ నారాయణ గౌడ్, జిల్లా అధికారులు, ఎంపీ ఓ, మండలంలోని అన్ని శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు