గుర్వాయిగుడెంలో గాలి వాన బీభత్సం

24-09-2026 | 02:23pm

దమ్మపేట, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): మండల పరిధిలోని గుర్వాయిగుడెం గ్రామంలో (Gurvayigudem Village)బుధవారం  రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలుల ప్రభావంతో గ్రామ పరిసరాల్లోని పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, జీడి, పత్తి, పామాయిల్ తోటల్లో భారీగా నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. బలమైన గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటల్లో కొమ్మలు విరిగిపడటంతో పాటు పామాయిల్ చెట్లు కూడా దెబ్బతిన్నాయి.

ఏళ్ల తరబడి పంట తోటలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ఒక్కసారిగా తుఫాను ప్రభావంతో వీచిన గాలులు తీవ్ర ఆందోళన కలిగించింది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యం రూపంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే గ్రామంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, సమగ్ర నష్టం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు