స్వచ్ఛ గ్రామంగా కోనరావుపేటను తీర్చిదిద్దాలి
కోనరావుపేట సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): స్వచ్ఛత హీ సేవా–2026 కార్యక్రమంలో (Swachhata Hi Seva – 2026 Programme)భాగంగా కోనరావుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం ఆధ్వర్యంలో స్వచ్ఛతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామంలోని వివిధ షాపులను సందర్శించి వ్యాపారులకు స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.ఘనవ్యర్థాల నిర్వహణ–2026 నిబంధనల ప్రకారం నాలుగు రకాల చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు చెత్త బుట్టలను వినియోగించాలని సూచించారు.
అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాల్సిన అవసరంపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మస్కూరి కాశీరాం మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పిలుపునిచ్చారు.అనంతరం ఉపాధి హామీ కూలీలకు, మోడల్ స్కూల్ విద్యార్థులకు ఘనవ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివకుమార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.