నూనె బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

24-09-2026 | 02:16pm

కోనరావుపేట సెప్టెంబర్ 24 (విజయక్రాంతి ):కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన నూనె బాలయ్య ఇటీవల మృతి చెందగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి (Enugu Manohar Reddy)ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేసి, కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగుల రాజు, జక్కుల నాగరాజు యాదవ్, పొన్నం పరశురాం గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సిద్ధంశెట్టి శ్రీనివాస్, అగ్రహారం ఆలయ మాజీ డైరెక్టర్ కొమ్ము ఎల్లయ్య యాదవ్, పొట్లపల్లి గోపాలరావు, గంగుల ప్రశాంత్ యాదవ్, శ్రీరాముల బాబు, మంకు అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు