మహిళలను కోటీశ్వరులు చేయుట కోసం మహిళా సమైక్య భవనం భూమి పూజ

25-09-2026 | 03:08pm

కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్

మాగనూరు సెప్టెంబర్ 25. మాగనూరు మండలం వడ్వాటు గ్రామంలో శుక్రవారం 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమైక్య భవన(Women's Federation Building) నిర్మాణ పనులకు భూమి పూజ సర్పంచ్ జీ రవీందర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేటు కోసమే ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు.

మహిళా సమైక్య సంఘ సభ్యులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం జరుగుతుంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఉప సర్పంచ్ కళ్యాణ్,ఏపీఎం జీవరత్నం, గంగాధర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, మహిళా సమైక్య అధ్యక్షురాలు తిరుపతమ్మ , పద్మమ్మ, మాజీ ఎంపిటిసి సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు