క్రీడా ఫీజుల పెంపుపై పెల్లుబికిన ఆగ్రహం
- క్రీడాకారులు, తల్లిదండ్రుల నిరసన
- వెంటనే తగ్గించాలని డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 : తెలంగాణలోని ప్రభుత్వ క్రీడా ప్రాంగణాలు, స్టేడియా లలో శిక్షణ ఫీజులను భారీగా పెంచడంపై క్రీ డాకారులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్ర హం వ్యక్తమవుతోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆ ఫ్ తెలంగాణ (Sports Authority of Telangana)ఇటీవల ప్రవేశపెట్టిన నూత న పే అండ్ ప్లే విధానం వల్ల క్రీడా కోచింగ్ ఫీ జులు ఒక్కసారిగా 50 శాతం పైగా పెరిగా యి. సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త ధరల వల్ల పేద, మధ్యతరగతి కు టుంబాలకు చెందిన పిల్లలు క్రీడలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ క్రీడాకారులు, వారి తల్లిదండ్రు లు ఎల్బీ స్టేడియం వద్ద నిరసన చేపట్టారు. క్రీడాకారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ, పాఠశాలల ఫీజులు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు క్రీడా ఫీజులు కూడా పెంచడంతో భరించలేకపోతున్నామ న్నారు. క్రీడా రంగ నిపుణులు, సీనియర్ కోచ్‌లు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వం పెంచిన క్రీడా ఫీజులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని క్రీడా కారులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.






