బీసీసీఐ ఏజీఎంలో కీలక నిర్ణయాలు
ముంబై, సెప్టెంబర్ 18: బీసీసీఐ95వ వార్షిక సభ్య సమావేశం(BCCI 95th Annual General Meeting) శుక్రవారం జరిగింది. ముంబై(Mumbai)లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్‌కు బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్(Mithun Manhas), ఉప్యాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajeev Shukla), కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ జనరల్ బాడీ(BCCI General Body)లో భాగమైన అరుణ్ సింగ్ ధుమాల్(Arun Singh Dhumal) మరోసారి ఐపీఎల్ చైర్మన్‌గా ఖరారు కాగా.. ఖైరుల్ జమాల్ మజుందార్ సభ్యుడిగా చేరారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. 2025--26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ ఆడిట్ చేయబడిన ఖాతాల నివేదికను జనరల్ బాడీ ఆమోదించింది. 2025--26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీసీసీఐ ఆడిట్ చేయబడిన ఖాతాల నివేదికను జనరల్ బాడీ ఆమోదించింది. 2026--27 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లను నియమించారు. అదేవిధంగా 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ ఎడిషన్‌ను ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
బీసీసీఐ శత వసంత ఉత్సవాలు 2028లో ఘనంగా నిర్వహించాలని జనరల్ బాడీ నిర్ణయించింది. దేశవాళీ క్రికెట్‌లో పని చేస్తున్న అంపైర్లు, రిఫరీల వేతనాలను పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. 2026-27 సీజన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దేశవాళీ అంపైర్లను ఎ, బి, సీ, డీ అనే నాలుగు గ్రేడ్లుగా విభజించేందుకు చర్యలు చేపట్టింది.
లైంగిక వేధింపుల నిరోధక విధానంలో భాగంగా బీసీసీఐ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల వయసు నిర్దారణకు సంబంధించిన విధానంలో అప్‌డేట్ తీసుకువచ్చింది. దివ్యాంగ క్రికెటర్లకు మద్దతుగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు, వారికి కల్పించాల్సిన వనరులు, సౌకర్యాల గురించి రాష్ట్ర అసోసియేషన్లతో చర్చించింది.