తెలంగాణ లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ

19-09-2026 | 11:05am

హైదరాబాద్: పెట్టుబడులు, అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల 2047 ఆర్థిక లక్ష్యాలపై కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక సమీక్ష నిర్వహిస్తోంది. సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. 2047 ఆర్థిక వృద్ధి ప్రణాళికపై చర్చించనున్నారు. తెలంగాణ లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల(3 Trillion Dollar) ఎకానమీ అని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశారు. వర్క్ షాప్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని భట్టి తెలిపారు. భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సభలోనే వివరాలు ఇచ్చారని సూచించారు. భూముల సమాచారాన్ని శాసనసభకు సమర్పించామని వెల్లడించారు. మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.


మరిన్ని వార్తలు