అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం

19-09-2026 | 02:22pm

గణపురం, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం ప్రాంగణంలో అంబేద్కర్ యువజన సంఘం (Ambedkar Youth Association) మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, రిజర్వేషన్లు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్‌పై కొందరు నాయకులు, పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని, లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ

కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు తిక్క సంపత్, దూడపాక దుర్గయ్య, మైనార్టీ మండల నాయకులు ఎం.డి. సైదులు పాషా, మాజీ ఉపాధ్యక్షుడు కుక్కముడి బాబు, దూడపాక శ్రీనివాస్, చిలువేరు దయాకర్, రజక సంఘం నాయకులు నేరెళ్ల శంకర్, కొంపెల్లి సాంబయ్య, అక్కపాక సుమన్, దుప్పటి శంకర్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు