పట్టించుకోని అధికారులు.. దుర్వాసనతో ప్రయాణికుల అవస్థలు
19-09-2026 | 02:26pm
కుభీర్ సెప్టెంబర్ 19(విజయక్రాంతి): భైంసా పట్టణంలోని ప్రధాన బస్టాండ్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రయాణికులు(Travelers )తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగు నీరు నిలిచిపోవడం, దుర్వాసన వెదజల్లడంతో ప్రయాణికులు, బస్సు సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి, మురుగు కాలువలను శుభ్రం చేసి, బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.