భారత్ డీఎన్‌ఏనే ధర్మం

19-09-2026 | 05:05am
  1. పాశ్చాత్య మతం కంటే భారత ‘ధర్మ’ం భిన్నమైనది
  2. దేశం విశ్వాసాల మధ్య ఎప్పుడూ వివక్ష చూపలేదు
  3. లౌకికవాదంపై మా అవగాహన ఇదే..
  4. ధర్మాన్ని జెన్‌జీలు చర్చించడం సంతోషకరం
  5. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనదే
  6. యువ ధర్మ సంసద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఉజ్జయిని, సెప్టెంబర్ 18: దేశంలో జెన్ జీలలో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని తొలగించడానికి ఆర్‌ఎస్‌ఎస్ విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. భారత దేశ డీఎన్‌ఏలోనే ధర్మం ఇమిడి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్(RSS Chief Mohan Bhagwat) అన్నారు. ‘ధర్మం’పై భారతదేశ(India) అవగాహన పాశ్చాత్య దేశాల మతం కంటే భిన్నమైనదని తెలిపారు. మన దేశం వివిధ విశ్వాసాల మధ్య ఎప్పుడూ వివక్ష చూపలేదని, లౌకి కవాదం పట్ల తమ అవగాహన ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

మతం కంటే ధర్మమే అన్నింటికన్నా మిన్న అని, ఇది మనిషి పుట్టుక నుంచి మరణం వరకూ తోడుంటుందని పేర్కొన్నా రు. ధర్మాన్ని కేవలం వృద్ధులు పాటించేది కాదని, అన్ని వయసుల వారు కూడా నేర్చుకోవా ల్సిందని, పాటించాల్సిం దని చెప్పారు. ధర్మాన్ని జెన్‌జీలు చర్చించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంపద సృష్టిపై ఎన్‌ఆర్‌ఐలు ధార్మిక దృక్ప థాన్ని కోరారని వెల్లడించారు. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, మానవ త్యాగం, దానధర్మాల ద్వారా ‘ధర్మం’ వర్ధిల్లు తుందన్నారు.

నేడు మనం చూస్తున్నటువంటి పర్యావరణ నష్టం లేకుండా భారతదేశం సుమారు 1,600 సంవ త్సరాలుగా ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్నదని తెలిపారు. అభివృద్ధిలో అసమతుల్యత అనారోగ్యకరం అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం(Madhya Pradesh)లోని ఉజ్జయిని(Ujjain)లో శుక్రవారం నిర్వహించిన యువ ధర్మ సంసద్‌లో సుమారు 1,700 మంది ‘జెన్-జీ’ ప్రతినిధులను ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవ త్ ప్రసంగించారు. ధర్మాన్ని కేవలం వృద్ధులకు సంబంధించిన విషయంగా కొందరు భావిస్తున్న తరుణంలో, యువత దాని గురించి చర్చించడం చూసి సంతోషంగా ఉందని భగవత్ అన్నారు.

మన దేశం ఎప్పుడూ సమ్మిళిత స్వభావం కలిగి ఉంది. ఇది ప్రజల మధ్య వివక్ష చూపదు. ‘మాకు ‘పంత్-నిరపేక్షత’ (మతపరమైన తటస్థత లేదా లౌకికవాదం) అంటే ఇదే అర్థం’ అని ఆయన అన్నారు. పాలకులు, మత పెద్దల మధ్య జరిగిన సంఘర్షణల నుంచి పాశ్చాత్య లౌకికవాద భావన ఉద్భవించిందని, అందుకే అది భారతీయ సందర్భానికి సరిగ్గా సరి పోదని భగవత్ పేర్కొన్నారు. భారతదేశం సంప్రదాయబద్ధంగా జీవితంలోని భౌతిక, ఆధ్యాత్మిక అంశాలను వేరుగా చూడకుండా, రెండింటి నీ కలిసే చూసిందన్నారు.

ధర్మం మతం కంటే ఉన్నతమై నదని స్పష్టం చేశారు. మతం బంధిస్తే, ధర్మం విముక్తిని ప్రసాదిస్తుందని, మోక్షా నికి దారితీస్తుందని అన్నారు. సత్యం, కరుణ, పవిత్రత, స్వీయ-క్రమశిక్షణ ఆధారంగా ఉండే ధర్మం నుంచి వేరుపడినప్పుడు మతం సంకుచి తమైనదిగా మారవచ్చని భగవత్ అన్నారు. ‘ధర్మం అనేది కొత్తగా కనుగొనాల్సిన విషయం కాదని, దానిని గుర్తించి ఆచరించాలి’ అని ఆయన తెలిపారు.

ప్రతి జీవి.. వస్తువు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే, విశ్వాన్ని నిలబెట్టే, అందరి పురోగతిని ప్రోత్సహించే, విధులను నిర్దేశించే సూత్రమే ‘ధర్మం’ అని అభివర్ణించారు. ధర్మం మానవ ప్రవర్తనలో ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. దానిని అర్థం చేసుకోవాలంటే యువత తమ దురభిప్రాయాలను వీడాలని ఆయన కోరారు.

ప్రకృతిని రక్షించడం మన కర్తవ్యం

ప్రకృతిని రక్షించడం మానవుల కర్తవ్యమని, పర్యావరణ బాధ్యత కూడా ధర్మంలో భాగమేనని భగవత్ తెలిపారు. అడవుల విధ్వంసం, పర్యావరణ క్షీణత ‘అధర్మం’ కిందకు వస్తాయని స్పష్టం చేశారు. యువత తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే, ఇతర ఆరాధనా పద్ధతులను గౌరవించాలని ఆయన కోరారు.

తాను ఇటీవల న్యూయార్క్, టొరం టో, లండన్‌లోలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడి ప్రజలు, భారతీయ పారిశ్రామికవేత్తలు వ్యాపారం, సంపద సృష్టిపై ధార్మిక దృక్పథాన్ని కోరారని భగవత్ చెప్పారు. తమ వ్యాపారాలు కేవలం సంతోషాన్నే కాకుండా, బాధలను కూడా సృష్టిస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అభివృద్ధిలో అసమతుల్యత దేశానికి అనారోగ్యకరమని భగవత్ తెలిపారు.

మానవ త్యాగం, దానాల ద్వారా.. ధర్మప్రవాహం

మానవ త్యాగం, దానధర్మాల ద్వారా ‘ధర్మం’ వర్ధిల్లుతుందని భగవత్ అన్నారు. భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత కోసం త్యాగం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. సంపద సంపాదించడానికి ఎలాంటి ఆంక్ష లేదని, అయితే ప్రజలు తమకు అవసరమైనంత మాత్రమే ఉంచుకుని, మిగిలినదాన్ని ఇతరులతో పంచుకోవాలని భగవత్ కోరారు. నేడు మనం చూస్తున్న పర్యావరణ నష్టం లేకుండా భారతదేశం సుమారు 1,600 సంవత్సరాలుగా ఆర్థికంగా సుసంపన్నంగా ఉన్నదని భగవత్ తెలిపారు. యువత విజయవంతంగా, సార్థకంగా ఎదగాలని, సంతోషం, శాంతితో కూడిన ప్రపంచాన్ని నిర్మించడంలో తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు