బయటకు వెళ్తున్నారా? జర భద్రం! తెలంగాణలో భారీ వర్షాలు

19-09-2026 | 08:37am

హైదరాబాద్: తెలంగాణలో(Telangana) రాబోయే రెండు వారాల్లో వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తాజా నివేదికలు వెల్లడించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం/అల్పపీడన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. సెప్టెంబర్ 19 నుండి 24 వరకు పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

శనివారం నాడు రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి-భువనగిరి(Yadadri Bhuvanagiri), మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి, ఉదయం వేళల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 


మరిన్ని వార్తలు