శీతల్ దేవికి స్వర్ణం
10-09-2026 | 05:10am
చరిత్ర సృష్టించిన భారత పారా ఆర్చర్
అహ్మదాబాద్, సెప్టెంబర్ 9: భారత పారా ఆర్చర్ శీతల్ దేవి(Indian para-archer Sheetal Devi) అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్ ఆర్చరీ పారా సిరీస్ (స్టేజ్-3) కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో శీతల్ విజయం సాధించింది. కజకిస్థాన్‌కు చెందిన ఐజాడా సెయ్దాన్‌ను షూట్‌ఆఫ్‌లో ఓడించిన శీతల్ దేవి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో శీతల్‌కు ఇది రెండో పతకం. కాంపౌండ్ మికస్డ్ టీమ్ విభాగంలో టోమన్ కుమార్‌తో కలిసి ఆమె ఇప్పటికే కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.