మానవ సేవయే మాధవ సేవ

19-09-2026 | 10:00pm

గజ్వేల్,(విజయక్రాంతి): మానవ సేవయే మాధవ సేవ అనే విధానంతో జీవన విధానం కొనసాగించాలని ఈఎన్‌టీ హాస్పిటల్(ENT Hospital) యాజమాన్య బృందం డాక్టర్ రాజామోహన్, డాక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. అయ్యప్పనగర్ కాలనీలో 24 ఏళ్లుగా వినాయక ఉత్సవాలను(Vinayaka celebrations) భక్తి, సేవాభావంతో నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళల కోలాటాలు, విద్యార్థుల ప్రతిభా కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, కుటుంబ సమ్మేళనాలు, అన్నప్రసాదం వంటి కార్యక్రమాలతో కాలనీవాసుల్లో ఐక్యత పెంపొందిస్తున్నారని ప్రశంసించారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతో చికిత్స పొందాలని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు