ఎమ్మార్పీఎస్ మండల, పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవ ఎన్నిక

19-09-2026 | 11:18pm

కల్లూరు,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) కల్లూరు మండల ఎమ్మార్పీఎస్(MRPS) నూతన అధ్యక్షుడిగా చాట్ల సునీల్‌కుమార్, పట్టణ అధ్యక్షుడిగా సంగెపు రామకృష్ణ, ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడిగా పరిగడుపు రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఇన్‌చార్జి కందికట్ల విజయ్ ఆధ్వర్యంలో శనివారం కల్లూరులో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో నూతన అధ్యక్షుల ఎన్నికను ప్రకటించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి, నాయకులు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.మాదిగల హక్కుల సాధన, వర్గీకరణ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కమిటీలను బలోపేతం చేసి,బహుజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు