నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

19-09-2026 | 11:21pm

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండల(Domakonda Mandal) కేంద్రంలోని గోసంగివాడలో నిరుపేద కుటుంబాలకు దోమకొండ గడీకోట ట్రస్ట్(Domakonda Fort Trust) ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ(Distribution of blankets) చేశారు. గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య చేతుల మీదుగా శనివారం పేద కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు బాబ్జి మాట్లాడుతూ దోమకొండ మండలంలోని ప్రతి వాడలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ట్రస్ట్ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మధు, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, మల్లేష్ యాదవ్, నర్సింలు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నెం నాగేంద్ర వర్మ, నాయకులు సుధాకర్ యాదవ్, అశోక్ యాదవ్, దేవరాజ్ యాదవ్, గణేష్, పిప్పిరి బాలరాజ్‌తో పాటు కాలనీవాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు