ఘనంగా గణేశుని నవరాత్రి ఉత్సవాలు

19-09-2026 | 11:39pm

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని19వ డివిజన్ మెయిన్ రోడ్ చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయక మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విగ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని మహా అన్నదాన వితరణ కార్యక్రమంలో స్థానిక 19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణ గౌడ్ భక్తులకు స్వయంగా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల(Ganesh navaratri celebrations) సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా విశేషమని భక్తులందరికీ నిరంతరాయంగా అన్నప్రసాదం అందించే బృహత్తర బాధ్యతను చేపట్టి ఉత్సాహంగా పనిచేస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సొలంకి కిషోర్. రాజు. సంత్ , శ్రీనివాస్. తదితరులు స్థానిక ప్రజలు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు