మహిళా సంఘాల సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు
27-09-2026 | 02:59pm
చిన్నగుండవెల్లి, రాఘవపూర్‌లో పరీక్షల నిర్వహణ
పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం(ULLAS Program)లో భాగంగా సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి, రాఘవపూర్ గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. సీసీ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలను ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్యార పద్మ శ్రీనివాస్, ఉపసర్పంచ్ వెంకట్, మహేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు ప్రవీణ్, రంగారెడ్డితో పాటు మహిళా సంఘాల సభ్యులు వీఓలు పాల్గొన్నారు.