నిబద్ధతకు నిలువెత్తు రూపం కొండా లక్ష్మణ్ బాపూజీ..
* కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు...
ఆదిలాబాద్, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): తెలంగాణ సామాజిక చైతన్య ప్రదాత, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) లౌకికవాదానికి, నిబద్ధతకు నిలువెత్తు రూపమని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్(DCC President Dr. Naresh Jadhav) కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్ర పటానికి, అదేవిధంగా గాంధీ పార్క్ వద్ద ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా DCC అధ్యక్షులు నరేష్ జాదవ్ మాట్లాడుతూ... బహుజనుల, చేనేత కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు ఆదర్శనీయమని చెప్పారు. బాపూజీ ఆశయాలను, ఆకాంక్షలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, ఆయన చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ సమాజ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ మంచి కట్ల ఆశమ్మ, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి బోజ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఓబీసి విభాగం అధ్యక్షుడు అంబకంటి అశోక్, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇంచార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.