కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, సెప్టెంబరు 27 (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ఆశయాలను నేటితరం ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అన్నారు.
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్ మాట్లాడుతూ బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు భీమనాథుని సత్యనారాయణ, భాగవతం బిక్షపతి, గోనె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.