లారీ యజమాని కుటుంబానికి రూ.1.44 లక్షల ఆర్థిక సహాయం
27-09-2026 | 03:05pm
గణపురం, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గణపురం మండలం(Ganapuram Mandal) లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లారీ యజమాని నల్ల రాజిరెడ్డి ఈ నెల 17న మృతి చెందగా ఆదివారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో గణపురం మండల లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మానవతా దృక్పథంతో అసోసియేషన్ అధ్యక్షుడు గండ్రత్ సురేందర్ ఆధ్వర్యంలో లారీ ఓనర్స్ కలిసి మృతుడి కుటుంబానికి రూ.1,44,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.