బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి "పొన్నం"
కోహెడ,(విజయక్రాంతి): హుస్నాబాద్ ఎల్లమ్మ చెర్వు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట వద్ద, బతుకమ్మ ఘాట్ మెట్ల వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో చెరువు వైపు భారీ కేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. సుందరీకరణ పనుల్లో భాగంగా అధికారులకు పలు సూచనలిచ్చారు. ఎల్లమ్మ చెరువు కట్టపై నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ ఆలయ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి , వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్డీవో రామ్మూర్తి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.