'డ్రంక్ అండ్ డ్రైవ్'లో ఇద్దరికి రెండు రోజుల జైలు
28-10-2026 | 08:51pm
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 28 : సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములవాడ కమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive) తనిఖీలో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు సీఐ మురళి(CI Murali) తెలిపారు. బుధవారం వారిని కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి విచారణ జరిపి ఇద్దరికి అయిదు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సీఐ మురళి తెలిపారు.