కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జి!

31-10-2026 | 02:20pm

కొమురవెల్లి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని (Komuravelli Mallanna Temple) రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు (High Court Judge Visit). ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్‌తో పాటు అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు (Special Pujas) నిర్వహించారు.

దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు (Temple Honors).ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. సుదర్శన్, అదనపు జిల్లా న్యాయమూర్తి వై. జయప్రసాద్, చేర్యాల కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్, ఆలయ ఈవో బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు