కార్మిక వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలి

31-10-2026 | 02:48pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను (Anti-Labour Policies) అమలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ విమర్శించారు. శనివారం రెబ్బెన గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం (AITUC Foundation Day) సందర్భంగా మండల అధ్యక్షుడు రమేష్ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఉపేందర్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్‌లను (Four Labour Codes) రద్దు చేసి, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. సింగరేణికి కొత్త బొగ్గు బావులు కేటాయించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు (Welfare Board) ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సత్యనారాయణ, కుమార్, సురేష్, రాజు, సుధాకర్, రత్నం దేవాజి, శంకర్, లాలూ, సునీల్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు