పట్టపగలే వీధిలైట్ల వెలుగులు.. విద్యుత్ వృథా
31-10-2026 | 02:58pm
జనగామ (కొడకండ్ల), అక్టోబర్ 31 (విజయక్రాంతి): జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామంలో పట్టపగలే వీధిలైట్లు (Street Lights) వెలుగుతున్నాయి. దీంతో విద్యుత్ వృథా (Power Wastage) అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళ వెలగాల్సిన వీధిలైట్లు పగటిపూట కూడా వెలుగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం (Public Money Loss) జరుగుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి వీధిలైట్ల నిర్వహణ (Street Light Maintenance) సక్రమంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.