క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

31-10-2026 | 03:17pm

మంచిర్యాల టౌన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి (Critical Care Hospital) నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించారు (Construction Progress Review).

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు (Quality Healthcare Services) అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రూ.129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం (Critical Care Unit) ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు