రైతులకు అండగా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చేగుంట, అక్టోబర్ 31 (విజయక్రాంతి): రైతులకు మద్దతు ధర (Minimum Support Price) కల్పించి, వారి పంటలను సజావుగా కొనుగోలు (Paddy Procurement) చేసేందుకు చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శ్రీధర్ ఉపసర్పంచ్ స్వామి, పంచాయతీ సెక్రటరీ సునందతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు (Paddy Purchase Centre) తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ శ్వేత, ఉపసర్పంచ్ స్వామి, సెక్రటరీ సునంద, జీపీఓ మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాల్రెడ్డి, కాషాబోయిన శ్రీనివాస్, వార్డు సభ్యులు వెంకటేశంగారి సిద్ధిరాములు, సదక్ పాషా, మాసాయిపేట శ్రీనివాస్, సీఏ ఆంజనేయులు, స్వప్న, పురుషోత్తం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.