విద్యార్థిని అఖిలకు హరీష్ రావు ఆపన్నహస్తం
సిద్దిపేట, (విజయక్రాంతి): కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్(MBBS) సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని అఖిలకు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ఆర్థిక సహాయం అందజేశారు.నాలుగేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన అఖిలను అప్పట్లో ఆదరించిన హరీష్ రావు..మెరీడియన్ విద్యాసంస్థలో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివించారు.
తాజాగా నీట్ పరీక్షలో అఖిల కొత్తగూడెం మెడికల్ కాలేజీలో సీటు సాధించడంతో ఆమెను తన నివాసానికి ఆహ్వానించి, కాలేజీ ఖర్చుల నిమిత్తం రూ. 70 వేల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎంబీబీఎస్‌తో పాటు పీజీ వైద్య విద్య పూర్తయ్యే వరకు అన్ని తానే చూసుకుంటానని ఆయన భరోసా కల్పించారు. తమ కుటుంబాన్ని పెద్దన్నలా ఆదుకుంటున్న హరీష్ రావుకు అఖిల, ఆమె తల్లి రేణుక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మెరిడియన్ ప్రిన్సిపాల్ కార్తీక్ పాల్గొన్నారు.