పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన..
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం..
సిద్దిపేట రూరల్,అక్టోబర్ 23: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day) సందర్భంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, ఆయుధాలు, వాకీటాకీలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ల గురించి అధికారులు వివరించారు.
డయల్ 112 అత్యవసర సేవలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. పోలీసుల విధులు, అమరవీరుల త్యాగాలను వివరిస్తూ, విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన, సామాజిక బాధ్యత పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ సీహెచ్ విద్యాసాగర్,ఎస్ఐ చంద్రమోహన్, ఎస్ఐ నవత,సిబ్బంది పాల్గొన్నారు