పట్టభద్రులు ఓటరు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు
- పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
- సింగరేణి జీఎం కార్యాలయాన్ని సందర్శించిన గండ్ర
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 23 ( విజయక్రాంతి ) : ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయాన్ని శుక్రవారం గండ్ర సందర్శించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరుగా నమోదుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉందని, చివరి తేదీ వరకు చూడకుండా ఉద్యోగులు అందరు ముందుగానే ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కాసేపు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డితో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీబీజికేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.