యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా వికలాంగులకు అన్నదానం

23-10-2026 | 04:03pm

సుల్తానాబాద్ , అక్టోబర్ 23 (విజయక్రాంతి): పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Pan-India star, Young Rebel Star Prabhas) జన్మదినాన్నిపురస్కరించుకొని శుక్రవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగ కేంద్రంలో ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ప్రభాస్ అభిమానులు  చాతల శివ ,పూసల రాకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది,  చిన్నారులకు, వృద్ధులకు  భోజనం పెట్టి, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం కేక్ కట్ చేసి ప్రభాస్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చాతల శివ మాట్లాడుతూ...ప్రభాస్ అన్న కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, మానవత్వం ఉన్న గొప్ప వ్యక్తి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున ఇలా అన్నదానం చేస్తున్నాం అని ,ప్రభాస్ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, "డార్లింగ్ ప్రభాస్ అన్న అంటే మాకు దేవుడితో సమానం అన్నారు.  

ఆయన నటన, వినయం మాకు ఎంతో ఇష్టం. ఆయన పుట్టినరోజును సేవా కార్యక్రమంతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే సినిమాలతో ప్రభాస్ అన్న ప్రపంచాన్ని ఏలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ , చాతల శివ మండలాధ్యక్షులుగర్విందుల సతీష్ , ఉపాధ్యక్షులుపూసాల రాకేష్ , ప్రధాన కార్యదర్శి కాని గంటి శ్రీకాంత్ , కోశాధికారి ఎలిగేడు మండల అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు