రక్షణ చట్టాలపై మహిళలకు అవగాహన తప్పనిసరి
బిజినేపల్లి, అక్టోబర్ 23 :- దేశంలోని మహిళలకు రక్షణ కల్పించే చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జెండర్ స్పెషలిస్ట్ సునీత(Gender Specialist Sunitha) అన్నారు. శుక్రవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెండర్ స్పెషలిస్ట్ సునీత మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై జారిగే లైంగిక వేధింపులు నివారించడానికి ప్రత్యేక చట్టం రూపొందించారని,
మహిళలు పట్ల అనుచితంగా తాకడం, అసభ్యకరమైన మాటలు, ఫోటోలు, లైంగిక ప్రయోజనం కోసం ఒత్తిడి చేయడం, ఇబ్బందికరమైన చూపులు, సంకేతాలు చేయడం ఆన్లైన్లో సోషల్ మీడియాలో వేధింపులకు గురయితే సంబంధిత సంక్షేమ అధికారికి ఫోన్ లేదా నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ మహిళలను గౌరవించినప్పుడే మన సంస్కృతిని మనం గౌరవించినట్లని తెలిపారు. మహిళలు ఏదైనా వేదనకు గురి అయినప్పుడు 181 హెల్ప్ లైన్ కు ఫోన్ ద్వారా సమస్యను తెలుపవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి లలిత, ఆర్ఐ రాధ. జిపిఓలు కృష్ణవేణి, పార్వతి, ప్రసన్న, మంజుల, పార్థ, కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.