దమ్మపేటలో మండల స్థాయి సమీక్షా సమావేశం
దమ్మపేట, అక్టోబర్ 23(విజయ క్రాంతి): మండల ప్రజా పరిషత్ కార్యాలయములో(Praja Parishad Office) మండల స్థాయి అధికారుల (45 రోజుల) సమీక్షా సమావేశం శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రవీంద్ర రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు హాజరైనారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో గడచిన 45 రోజులలో జరిగిన వారి వారి శాఖా పరమైన ప్రగతి పై చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలములో వ్యవసాయం చేయుటకు ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వలన భుగర్భ జలాలు, వర్షాభావం వలన సాగునీటి కొరత ఉన్నందున రైతులకు వ్యవసాయ అధికారి సూచనల ద్వారా వరి, మొక్కజొన్న, శనగ ఇతర నీటి ఆధారిత పంటలను వేయవద్దని సూచించారు.
గ్రామ పంచాయితీ సర్పంచులకు ప్రస్తుతం ఎలినో ప్రభావం వలన త్రాగునీటి, విధ్యుత్ వాడకములపై సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తమ తమ పంచాయితీలలోని ప్రజలను విద్యుత్, నీటిని వృధా కాకుండా వినియోగించ వలసినదిగా ప్రచారం చేయవలసినదిగా సంబంధిత అధికారులు సూచనలు చేశారు. ఈ సమావేశంలో దమ్మపేట తహాసిల్దారు( ట్రైనీ డిప్యూటి కలెక్టరు) మద్దినేని మురళి, మండలంలోని పంచాయతీ సర్పంచులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.